56 మందికి సహాయం ఇది చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

0
2

56 మందికి ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను అందజేసిన

ఎమ్మెల్యే సుజనా చౌదరి…

పశ్చిమ నియోజకవర్గంలో అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 56 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చామని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు

శనివారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో 56 మంది లబ్ధిదారులకు రూ 29 లక్షల 70 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు అందజేశారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రజారోగ్యమే లక్ష్యంగా పశ్చిమలో పెద్ద ఎత్తున ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు..

ముందస్తు రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు

రెండేళ్ల పాలనలో పశ్చిమాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నామని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ పార్టీలకతీతంగా సేవలనందిస్తున్నామన్నారు

పశ్చిమ అభివృద్ధికి మరింత మెరుగైన పాలనకు

ప్రతి ఒక్కరు సలహాలు సూచనలు ఇవ్వాలని ఎమ్మెల్యే సుజనా కోరారు..