ఎమ్మిగనూరు పట్టణం.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఎమ్మిగనూరు పట్టణంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య అట్టహాసంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఎమ్మిగనూరు ఎంజీ పెట్రోల్ బంక్ సర్కిల్ వద్ద భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న రాజీవ్ రెడ్డి గారు అందరి అభినందనలు, శుభాకాంక్షలు స్వీకరించారు.ఈ వేడుకలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని రాజీవ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ నాయకులు, కార్యకర్తలు తమ అభినందనలు తెలిపారు.










