30/5/26న అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ శాఖ సరికొత్త తనిఖీలకు శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు అధునాతన ‘డ్రగ్ డిటెక్షన్’ కిట్లను వినియోగిస్తూ పీలేరు, పుంగనూరు పరిధిలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. గతంలో గంజాయి కేసుల్లో పట్టుబడిన నిందితులు, అనుమానితులపై నిఘా ఉంచి ఈ పరీక్షలు నిర్వహించారు.
పీలేరు పరిధిలో 8 మందికి, పుంగనూరు పరిధిలో 5 గురికి పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి రాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ వస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. గంజాయి, అక్రమ రవాణాపై డయల్ 112, ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సంప్రదించాలని సూచించారు# కొత్తూరు మురళి.








