పుంగనూరు మండలం, దిగువపల్లి గ్రామంలో బోరు బావుల వద్ద కేబుల్ వైర్లు దొంగిలించే ప్రయత్నం చేస్తున్నాడనే అనుమానంతో శనివారం రాత్రి రామసముద్రం మండలం.
తిరుమలరెడ్డి పల్లి గ్రామానికి చెందిన బాబా సాహెబ్ (32)ను గ్రామస్తులు కర్రలతో, కేబుల్ వైర్లతో చితకబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు అతన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .








