అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం నక్కలదిన్నె ఏరియాలోని సత్సంగ్ ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.
ఈ డ్రైవ్‌లో మున్సిపల్, మెప్మా, ఇంజనీరింగ్, పారిశుద్ధ్య విభాగాల సిబ్బందితో పాటు సత్సంగ్ సంస్థ ప్రతినిధులు, వార్డు సెక్రటరీ సిబ్బంది పాల్గొన్నారు. సత్సంగ్ ఏరియాలోని ప్రధాన రహదారిని శుభ్రం చేసి, రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను, తుప్పలను జెసిబిల సహాయంతో తొలగించారు.









