మల్లంపల్లి హై స్కూల్ విద్యార్థిని కావ్యశ్రీకి ట్రిపుల్ఎటీ బాసరలో సీటు.
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం జూన్ 1 రోజున దుగ్గొండి మండలం మల్లంపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని జనగాం కావ్యశ్రీకు ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటి విద్యాలయంలో సీటు వరించింది. ఇటీవల విడుదలైన పదోతరగతి పరీక్షలలో ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్ లలో జిల్లా టాపర్ గా కావ్యశ్రీ నిలిచింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ట్రిపుల్ ఐటి). ఇది భారతదేశంలో సాంకేతిక విద్యను అందించే ప్రతిష్టాత్మకమైన జాతీయ విద్యాసంస్థల సమూహం.రాజివ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ కళాశాల. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా, బాసర పట్టణంలో ఉన్న ఒక ప్రతిష్టాత్మక ప్రభుత్వ విశ్వవిద్యాలయం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.చిన్నారి కార్యశ్రీకి ప్రతిష్టాత్మక ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో సీటు రావడం పట్ల తాతయ్య అమ్మమ్మ మల్లంపల్లి మాజీ సర్పంచ్ తడుక సువర్ణ కొమురయ్య గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. తమ పాఠశాల విద్యార్థిని జనగాం కావ్యశ్రీ పదోతరగతి పరీక్షలో జిల్లా టాపర్ గా నిలిచి మల్లంపల్లి పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిందని అన్నారు.నేడు బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో సీటు సాధించడం గర్వకారణం అని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భార్గవి అన్నారు.ఈ సందర్భంగా కావ్యశ్రీని అభినందించారు..
కావ్యశ్రీకి ప్రశంసల వెల్లువ..ఎస్ఎస్సి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి జిల్లా టాపర్ గా నిలిచి బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో సీటు సాధించిన జనగాం కావ్యశ్రీకి అభినందనలు వెల్లువెత్తాయి.ప్రత్యక్షంగా పలువురు నాయకులు, అధికారులు, గ్రామస్తులు అభినందనలు తెలుపగా కొందరు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన జనగాం కావ్యశ్రీ భవిష్యత్ లో ఉన్నత శిఖరాలను అధిగమించాలని పలువురు కోరారు…. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము










