పుంగనూరు: తహసిల్దార్ కార్యాలయం వద్ద భారీ నిరసన

0
2

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం బాల గురవయ్య గారి పల్లి గ్రామానికి చెందిన దళితులకు ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని మంగళవారం తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చిన్నరాయుడు మాట్లాడుతూ, వర్షాల కాలంలో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తోపు మఠం వద్ద ప్రభుత్వ భూమిలో దళితులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.