ఆదివారం నుంచి కనిపించని బాలుడు.. సమాచారం ఇవ్వాలంటూ పోలీసుల విజ్ఞప్తి.|

0
9

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా : బొల్లారం బజార్ ప్రాంతంలో ఏడు సంవత్సరాల బాలుడు అదృశ్యమైన ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.

మణికంఠ అనే బాలుడు ఈ నెల 31వ తేదీ ఆదివారం సాయంత్రం సుమారు 4:35 గంటల సమయంలో చివరిసారిగా కనిపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అప్పటి నుంచి బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

బాబు, రమ్య దంపతుల కుమారుడైన మణికంఠ వయస్సు 7 సంవత్సరాలు. తెల్లటి వర్ణంతో సుమారు 4.5 అడుగుల ఎత్తు కలిగిన ఈ బాలుడు అదృశ్యమైన సమయంలో ఎరుపు రంగు చొక్కా, ప్యాంటు ధరించి ఉన్నట్లు సమాచారం.

బాలుడి కోసం కుటుంబ సభ్యులు, స్థానికులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటివరకు ఎలాంటి ఆచూకి లభించలేదు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న బొల్లారం పోలీసులు బాలుడి ఆచూకీ కోసం చర్యలు చేపట్టారు.

మణికంఠను ఎక్కడైనా గుర్తించినా లేదా అతని గురించి ఏదైనా సమాచారం తెలిసినా వెంటనే కుటుంబ సభ్యులను 8185035791 నంబర్‌లో లేదా బొల్లారం పోలీస్ స్టేషన్ 8712661260 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

బాలుడి ఆచూకీ త్వరగా లభించేందుకు ఈ సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేసి సహకరించాలని కోరుతున్నారు.

#Sidhumaroju

Alwal