🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్)
ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవా లక్ష్మి తెలంగాణ ముఖ్యమంత్రి వైఖరిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ. సభలో జిల్లా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్దామని ప్రయత్నిస్తే, తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా అడ్డుకున్నారని అన్నారు. సభకు అధ్యక్షత వహించాల్సిన స్థానిక ఎమ్మెల్యే అయిన తనను మాట్లాడనివ్వకుండా, అధికారిక ప్రోటోకాల్‌ను పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. ఆదివాసి మహిళా ఎమ్మెల్యే అయిన తనపై ముఖ్యమంత్రి చూపిన ఈ వైఖరి బాధాకరమని, ఇది తనకు మాత్రమే కాకుండా మొత్తం ఆదివాసీ సమాజాన్ని అవమానించడమేనని స్పష్టం చేశారు. సభ సాక్షిగా సమస్యలను లేవనెత్తితే ఏం జవాబు చెప్పాలో తెలియకనే, తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.ఈ సమావేశంలో మున్సిపాలిటీ చైర్మన్ యం ఆకాష్ , వైస్ చైర్మన్ యం డి హైమద్, PACS చైర్మన్ అలీ గారు మరియు సర్పంచ్ బుర్స పోసయ్య,మాజీ సర్పంచ్ బలరాం,నాయకులు నిసార్,సైదాం సురేష్, అబ్దుల్లా,సాయి,ఆన్సర్, జావీద్, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.








