పుంగనూరు ఐటీఐకి నూతన ప్రిన్సిపాల్‌గా సురేష్ కుమార్ బాధ్యతలు

0
0

పుంగనూరు ప్రభుత్వ ఐటీఐకి నూతన ప్రిన్సిపాల్‌గా సి. సురేష్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో తిరుపతి ప్రభుత్వ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్‌గా పనిచేసిన సురేష్ కుమార్, తన సేవలను గుర్తించిన ప్రభుత్వం పదోన్నతి కల్పించి ఈ బాధ్యతలు అప్పగించింది. విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించడంతో పాటు, ఐటీఐలో శిక్షణా ప్రమాణాలను మెరుగుపరిచి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు# కొత్తూరు మురళి.