🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ బాబాపూర్:జూన్ 04 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండలం పరిధిలోని బాబాపూర్ గ్రామ పంచాయితీలో 99వ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ ఏక్ పెడ్ మా కే నామ్– అమ్మ పేరిట ఒక మొక్క, కార్యక్రమంలో భాగంగా సామూహికంగా మొక్కలు నాటారు.ఈ సభలో గౌరవ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీ యువ రాజ్ సార్ గారు, బాబాపూర్ గ్రామ సర్పంచ్ సత్రవేణి రాజన్న గారు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ భిక్షపతి గారు, జిల్లా స్థానిక సంస్థల అదనపు అధికారి ఉమర్ గారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ గారు, మండల రెవెన్యూ అధికారి (తహసిల్దార్) రియాజ్ అలీ గారు, మండల పరిషత్ అధికారిణి శ్రీమతి మౌనిక గారు, ఉపాధి హామీ సహాయ నియోజక అధికారి శ్రీ బుచ్చన్న గారు, గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రీ దేవరాజ్ గారు, స్థానిక వార్డు సభ్యులు, పంచాయితీ సిబ్బంది మరియు బాబాపూర్ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.










