చౌడేపల్లె మండలం బోయకొండ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మురుగేశ్ (31) తీవ్రంగా గాయపడ్డారు. సొంత పని మీద బోయకొండకు బైక్‌పై వచ్చిన ఆయన, పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన మురుగేశ్‌ను చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అవుట్ పోస్ట్ పోలీసులు వివరాలు సేకరించారు








