14 యేళ్ళు ఉద్యమం నడపాలంటే ఎన్ని ఆర్ధిక వనరులు కావాలి…

0
0

 ప్రతి మండలానికి ధూమ్ ధాం ప్రోగ్రామ్ చెయ్యాలి అంటే ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది? 

‎‎ కళాకారులకు కూడా కుటుంబం ఉంటుంది కదా,వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వక పోతే పాడే వాళ్ళా?

‎ఎంతమంది మీద కేస్ లు అయితే వాళ్ళకి బెయిల్,లాయర్ ఖర్చులకు ఎంత అయ్యి ఉంటుంది?

‎నీ ఇంట్లో చిన్న పుట్టిన రోజు పండగ చేస్తేనే దానికి 15 రోజుల ప్రిపరేషన్ చేస్తావ్,అప్పుడే అది సంతోషంగా జరుగుతుంది…

‎కోదండరాం రెడ్డి ఉద్యమం చేసిండు ,కానీ ఆయనను ఆ పదవిలో కూర్చోబెట్టింది ఎవరు? అప్పటివరకు ఆయన పేరు మీకు తెలుసా?

‎ అమరుల కుటుంబాలకు అధికారం లోకి రాకముందే కేసీఆర్ కొంత డబ్బులు ఇచ్చింది వాస్తవం కాదా?

‎ ఎందుకురా కళ్ళు మూసుకొని ఆత్మ వంచన చేసుకుంటూ కేసీఆర్ ఒక్కడి వల్లనే తెలంగాణ రాలేదు అంటున్నారు ?విద్యార్దులు,అమరుల వల్లనే వచ్చింది అది ఎవరూ కాదనలేరు,కానీ వీళ్ళను జాగృతం చేసింది ఎవరు?

‎తెలంగాణ రాజకీయ ప్రక్రియ ద్వారానే సాధ్యం అని నమ్మి ప్రజలను ఏకం చేసి తెలంగాణ వస్తుంది అనే నమ్మకం కలిగించింది ఎవరు?

‎ ఇక కాంగ్రెస్ అమరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ ఇచ్చింది అంటున్నారు కదా 1969లో అమరులు లేరా?

‎2001 నుండి 2010 వరకు లేరా? అప్పుడు ఎందుకు ఇవ్వలేదు?

‎ చనిపోయిన వాళ్ల గురించి తప్పుగా మాట్లాడవద్దు కానీ తప్పడం లేదు…

‎ గేట్ ముందు గద్దర్ నిలబడ్డాడు అని నిజాలు తెలియకుండా ప్రచారం జరుగుతున్నప్పుడు ఒక్క నాడైనా కేసీఆర్ నాకు ఇది చేశాడు కార్ ఇచ్చాడు అని చెప్పాడా?

‎ చెప్పడు…. కారణం అందరికీ తెలుసు..

‎ కానిస్టేబుల్ శ్రీనివాస్ ను పట్టించుకోలేదు అంటున్నారు ,అతనికి KCR గారు డైరెక్ట్ గా si పోస్ట్ నిచ్చాడు

‎ కానీ తను నీ బాడీగార్డ్ గా ఉంటాను అన్నాడు… 

‎ఇలా చెప్పుకుంటూ పోతే మీకు తెలియని వాస్తవాలు చాలా ఉన్నాయి.

‎మీరు వాస్తవం అని నమ్ముతున్న అవాస్తవాలు ఎప్పటికో ఒక నాటికి ఇది కదా వాస్తవం అని తెలుసుకుంటే మీ మనసు ఏం చెపుతుంది చూడండి.

‎రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ కేస్ పెట్టాడు అంటున్నారు…

‎ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు కాకుండా 2006 లోనే దొంగ డాక్యుమెంట్స్ పెట్టు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కి పోతే నాటి sro కేస్ book చేస్తే జైలు కి పోయిన విషయం మీకు తెలుసా? అది పొలిటికల్ కేస్ కాదు…