ఆంధ్రప్రదేశ్ ను తాకిన నైరుతి రుతుపవనాలు

0
0

ఆంధ్రప్రదేశ్ ను తాకిన నైరుతి రుతుపవనాలు

ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాయలసీమ జిల్లాలను రుతుపవనాలు తాకినట్లు అమరావతి వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఇవి రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు .

పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.