ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, శుక్రవారం పుంగనూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్, పురపాలక సంఘ ప్రత్యేక అధికారి కళ్యాణి మొక్కలు నాటారు.
నేటి మొక్కలే రేపటి వృక్షాలుగా మారి పర్యావరణ సమతాల్యంలో కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో ఒక్క మొక్క నాటాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










