విజయవాడ ను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుదాం

0
0

విజయవాడను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతాం: ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడను భవిష్యత్తులో ప్రముఖ “స్పోర్ట్స్ సిటీ”గా, యువత కలలను సాకారం చేసే స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) స్పష్టం చేశారు. పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.

పీవీ సింధు స్పూర్తితో గ్రామీణ ప్రాంతాల నుండి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు వెలుగులోకి రావాలన్నారు. ఈ స్టేడియాన్ని ఆధునిక సదుపాయాలతో రాష్ట్రంలోనే ఆదర్శ క్రీడా వేదికగా మారుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం క్రీడాకారుల్లో ఉత్సాహం నింపుతూ ఎంపీ స్వయంగా బ్యాడ్మింటన్ ఆడారు.