విశాఖపట్నం నగరాన్ని ప్రపంచ స్థాయి ‘బే సిటీ’గా తీర్చిదిద్దేందుకు అవసరమైన సమగ్ర కార్యాచరణను వెంటనే చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్)పై నిర్వహించిన సమీక్షలో.. కైలాసగిరి నుంచి భోగాపురం వరకు తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సూచించారు.
గ్రేహౌండ్స్ పరిధిలోని 303 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్, బీచ్ వాటర్ స్పోర్ట్స్, జంతు ప్రదర్శనశాల ఆధునీకరణ మరియు ఎర్రమట్టి దిబ్బల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నీతి ఆయోగ్ నివేదికపై మేధావులు, విద్యార్థుల నుండి అభిప్రాయాలు సేకరించాలని కోరారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.










