రొంపిచర్ల మండలం చల్లవారిపల్లె పంచాయతీ వైసీపీ కన్వీనర్ మోహన్ రెడ్డి శనివారం తన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దహనం చేసినట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద బైక్ ను ఉంచి ఇంటికి వెళ్లగా, ఉదయం చూసేసరికి అది కాలిపోయిందని ఆయన వివరించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మోహన్ రెడ్డి పేర్కొన్నారు# కొత్తూరు మురళి.









