“మాజీ ప్రజాప్రతినిధుల పెన్షన్లు రద్దు చేయాలి: అడ్వకేట్ మహ్మద్ సద్దాం డిమాండ్”

0
5

మాజీ ఎమ్మెల్యేలకు ,మాజీ ఎమ్మెల్సీలకు, మాజీ ఎంపీలకు నెలనెలా ప్రభుత్వాలు చెల్లించే పెన్షన్లు రద్దు చేయాలి. వీరి వలన సమాజానికి ఎలాంటి ఉపయోగము లేదు. అనవసర దుబారా ఖర్చు. వీళ్లంతా వైట్ ఎలిఫెంట్స్. గతంలో వీరు ఎమ్మెల్యేగా ఎంపీలుగా ఉన్నప్పుడు ప్రజల సొమ్మును దోచుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి వేలాది కోట్లు సంపాదించి నగరాల నడిబొడ్డున అధునాతనమైన వసతులు కలిగిన విలాసవంతమైన భవనాలు నిర్మించుకుని నివసిస్తూ, ఖరీదైన కార్లలో తిరుగుతూ, మల్టీ నేషనల్ కంపెనీలు స్థాపించుకుని వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకుని అధిక మొత్తంలో బ్యాంకు బ్యాలెన్స్ కలిగి ఉంటూ ఆనందంగా జీవిస్తున్న వీరికి పెన్షన్లు ఇవ్వడం అవసరమా. గతంలో వీరంతా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కాకముందు రబ్బరు చెప్పులకు గతి లేని వాళ్లంతా కోట్లకు పడగలెత్తారు. వీరు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో భూముల దురాక్రమనకు పాల్పడ్డారు. బినామీల పేరుతో ఆస్తులు కొనుగోలు చేశారు .

అందమైన విల్లాస్ కట్టుకున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించుకున్నారు. ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ కాకముందు బీడీలు తాగేవాడు కూడా గోల్డ్ ప్యాక్ కింగ్ సైజ్ సిగరెట్లు తాగుతూ, గతంలో చీప్ లిక్కర్ తో సరిపెట్టుకునే వాళ్ళు .పదవులు వచ్చిన తర్వాత కాస్ట్లీ బ్రాండ్లు మందు తాగుతూ నిత్యం మందు కైపులో ఊగుతూ తూగుతూ పంచభక్ష పరమాన్నాలు భుజిస్తూ, శారీరక సుఖం కోసం డబ్బులు ఇచ్చి కొనుక్కున్న మగువుతో తైతక్కలాడుతూ సుఖవంతమైన జీవితాలు గడుపుతున్నారు . ప్రభుత్వానికి ప్రజలు చెల్లించిన పన్నుల సొమ్ముతో వీరికి పెన్షన్లు ఇవ్వడం. ప్రజల సొమ్మును దుర్వినియోగపరచడం అవుతుంది. మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు వీరంతా స్వాతంత్ర సమరయోధులు కారు. దేశం కోసం ధర్మం కోసం పోరాడిన చరిత్ర లేని వాళ్ళు. వీరంతా దండగ పిండాకూడుకు అలవాటు అయిన వాళ్లు.

సిగ్గు ఎగ్గు లేకుండా మంది సొమ్ము తినడానికి ముందు వరుసలో ఉంటున్నారు. ఎమ్మెల్యేగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా పదవీకాలంలో ఉన్నప్పుడు వీరంతా ప్రజా సేవ చేసింది ఏమీ లేదు. తమ 5 ఏళ్ల పదవీకాలంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసింది ఏమీ లేదు. ప్రజల దృష్టిలో చేతకాని దద్దమ్మల్లాగా నిలిచిపోయారు. ప్రజా సంపదకు దోపిడీకి పాల్పడిన వారు, అక్రమ అవినీతి ఆస్తులు కూడబెట్టుకున్న వాళ్ళు. అంతస్తులు కలిగిన వాళ్లు సామాజిక అవగాహన లేని వాళ్ళు, దోపిడి స్వభావం కలిగిన వాళ్లు, మానవ విలువల పట్ల పనిచేసిన వాళ్లు కారు, కుల మత రాజకీయాల రొంపిలో కూరుకుపోయిన వాళ్లు. నైతిక విలువలు లేని వాళ్ళు. వీరంతా సమాజానికి భారం. మాజీ ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్సీలకు మాజీ ఎంపీలకు పెన్షన్లు రద్దు చేయాలి .మాజీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు లక్షల లక్షల పెన్షన్లు కాకుండా ప్రజాధనాన్ని వృధా చేయకుండా వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు దివ్యాంగులకు పక్షవాతం వచ్చి మంచం పట్టిన వాళ్లకు, క్యాన్సర్ రోగులకు వివిధ సందర్భాల్లో అత్యాచారాలకు గురైన మహిళలకు ఉపాధి కోసం ఇచ్చే పెన్షన్ లాగా మాజీ ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్సీలకు ఎంపీలకు నెలకు 4000 రూపాయలు ఇస్తే సరిపోతుంది. మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వ పెన్షన్లు తీసుకుంటున్న వాళ్లంతా దరిద్రులు కారు. నిరుపేదలు కారు వీళ్లంతా సంపన్నుల జాబితాలో ఉన్నారు. వెంటనే మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు ఎంపీలకు పెన్షన్లు రద్దు కోసం ప్రజాస్వామ్యవాదులు పోరాటం చేయాలని మనవి.

‎ Adv మహ్మద్ సద్దాం