నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదు.. సీఎంకు కిషన్ రెడ్డి కౌంటర్!

0
6

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

‎ “నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదు” అంటూ సవాల్ విసిరారు.

‎KCRలా తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదన్నారు.

‎ కాంగ్రెస్ పార్టీని ప్రజలు అడ్రస్ లేకుండా చేస్తారని వ్యాఖ్యానించారు.

‎రాహుల్ గాంధీ కలలో కూడా ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు.

‎ రేవంత్ మాటలు కోటలు దాటుతున్నా, చేతలు మాత్రం సచివాలయం గోడలు దాటట్లేదని ఎద్దేవా చేశారు.