బాధితులకు త్వరితగతిన న్యాయం అందించండి: ఎస్పీ.

0
4

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో సోమవారం పాల్గొని బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. భూతగాదాలు, సైబర్ మోసాలు, కుటుంబ వివాదాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, చట్టపరిధిలో నిష్పక్షపాతంగా విచారించి, తక్షణ న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయరాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడమే పోలీసు శాఖ లక్ష్యమని తెలిపారు.