బీటీ కళాశాలకు యూనివర్సిటీ హోదా కల్పించాలి: AISF.

0
5

మదనపల్లి బీటీ కళాశాలకు యూనివర్సిటీ స్థాయి కల్పించాలని AISF మాజీ రాష్ట్ర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలో జరిగిన AISF అన్నమయ్య జిల్లా స్థాయి శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రాధాన్యమిస్తున్నాయని విమర్శించారు.

నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, వర్సిటీల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేట్ దోపిడీపై AISF పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.