అశోక్ టవర్స్ మరియు విజేత టవర్స్ ప్రాంతాలలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య పరిష్కారం.
అశోక్ టవర్స్ మరియు విజేత టవర్స్ పరిసర ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ బ్లాక్ కావడంతో గత కొన్ని రోజులుగా మురుగు నీరు నిల్వ ఉండి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్య నా దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులు మరియు సిబ్బందితో సమన్వయం చేసి అవసరమైన చర్యలు చేపట్టించాను. వారి సహకారంతో డ్రైనేజ్ లైనును పూర్తిగా శుభ్రపరచించి, బ్లాక్‌ను తొలగించి సమస్యను విజయవంతంగా పరిష్కరించడం జరిగింది.
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాల నిర్వహణకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను అని అయన అన్నరు.
నాగొల్ల లక్ష్మీనారాయణ
19వ డివిజన్ కార్పొరేటర్
జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి









