● నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలి
● వాస్తవాలను ప్రజలకు చేరవేయాలి
అల్వాల్, అక్టోబర్ 24:ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా పాత్ర కీలకమని, మహిళా జర్నలిస్టులు నాయకత్వ బాధ్యతలను స్వీకరిస్తూ వాస్తవాలను నిర్భయంగా ప్రజలకు చేరవేయాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ పిలుపునిచ్చారు.
భిన్నాభిప్రాయాలను గౌరవిస్తూ వృత్తి నైపుణ్యంతో పనిచేయాలని సూచించారు.
హైదరాబాద్లోని బేగంపేట టూరిజం ప్లాజాలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU), మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా (MEFI) సంయుక్త ఆధ్వర్యంలో, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) ఆతిథ్యంలో నిర్వహించిన జాతీయ మహిళా జర్నలిస్టుల సదస్సులో సుమతి మాట్లాడారు.
రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క సదస్సును ప్రారంభించారు.
మహిళలు సంపాదకీయ విభాగానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి రిపోర్టింగ్లోనూ ముందుండాలని, సామాజిక సవాళ్లను అధిగమిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలవాలని సుమతి సూచించారు. మహిళా జర్నలిస్టుల ధైర్యం, నాయకత్వం, వృత్తి నిబద్ధత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
#Sidhumaroju
Alwal










