బోయకొండ గంగమ్మ జాతర: ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు.

0
4

అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని కోళ్లబైలు టు బాబు కాలనీలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
సోమవారం రాత్రి అమ్మవారి ఊరేగింపు, మంగళవారం కల్లుకుండ, ధీలు మోయు కార్యక్రమాలు, బుధవారం బాణాలు చెల్లించే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.