వృద్ధి రేటు పెంపుపై సీఎం చంద్రబాబు ఫోకస్.. శాఖలకు స్కోరింగ్ విధానం!

0
0

వృద్ధి రేటు పెంపుపై సీఎం చంద్రబాబు ఫోకస్.. శాఖలకు స్కోరింగ్ విధానం

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక కార్యాచరణ ప్రారంభించారు. ప్రభుత్వ శాఖల పనితీరును అంచనా వేసేందుకు ‘కీ-పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు’ (కేపీఐ) నిర్దేశిస్తూ, వాస్తవ వృద్ధి ఆధారంగా స్కోరింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతి నెలా 12వ తేదీన ఆర్థిక నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఏఐ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై ఆయన ఆలోచన పంచుకున్నారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్య సాధన కోసం అమరావతి, పోలవరం, పోర్టుల వంటి కీలక ప్రాజెక్టుల ద్వారా డేటా ఆధారిత పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం స్పష్టం చేశారు