గోదావరి ప్రక్షాళనకు కేంద్ర నిధులు.. పవన్ చర్యలకు ప్రశంసలు
గోదావరి నదిని కాలుష్యం నుండి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 400 కోట్ల నిధులు ప్రకటించిందని, ఇప్పటికే రూ. 100 కోట్లు మంజూరయ్యాయని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వెల్లడించారు. రాబోయే పుష్కరాల నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలోని 290 గ్రామాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో గోదావరి కాలుష్యంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకున్న కఠిన చర్యలను వీర్రాజు అభినందించారు. నదిని కలుషితం చేస్తున్న ఆంధ్ర పేపర్ మిల్లుతో పాటు రాజమండ్రి నగరపాలక సంస్థకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని పవన్ ఆదేశించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఒక డైనమిక్ లీడర్‌గా పవన్ కల్యాణ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు










