టాలీవుడ్ ఇండస్ట్రీ బాటలో… ఫోక్ ఇండస్ట్రీ ?

0
0

తెలంగాణ జానపద పరిశ్రమను, నిర్మాతలను కాపాడుకుందాం

ఫోక్ ఇండస్ట్రీ బతకాలంటే నిర్మాత, నిజమైన స్థానిక కళాకారులు బతకాలి. ప్రస్తుతం యూట్యూబ్ జానపద పాటల ప్రొడక్షన్ ఖర్చులను విపరీతంగా పెంచి నిర్మాతల నడ్డి విరుస్తున్నారు. పాటను సినిమా బడ్జెట్‌తో పోల్చడం వల్ల నిర్మాతలు నష్టపోతున్నారు. దళారీ వ్యవస్థను నమ్మకుండా ప్రొడ్యూసర్లే బడ్జెట్‌ను అదుపులో పెట్టుకోవాలి.

తెలంగాణ జానపద శైలి తెలియని వారికి లక్షలు ఇస్తూ, ఇక్కడి స్థానిక ప్రతిభను రూ. 5-10 వేలకే పరిమితం చేయడం తగదు. గతంలో సీడీల కాలంలో జరిగిన తప్పులే మళ్లీ పునరావృతమవుతున్నాయి. ఇప్పటికైనా రెమ్యునరేషన్లు తగ్గించి, బడ్జెట్ అదుపులో ఉంచి నిజమైన తెలంగాణ కళాకారులను, నిర్మాతలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.