చీరాలలో రాష్ట్రస్థాయి ఉమెన్స్ ప్రో కబడ్డీ పోటీలు ప్రారంభం
చీరాల రోటరీ క్లబ్ ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే రాష్ట్రస్థాయి ఉమెన్స్ ప్రో కబడ్డీ ఛాంపియన్షిప్ను స్థానిక ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు. టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితంలో చదువుతో పాటు క్రీడలు కూడా కీలక పాత్ర పోషిస్తాయన్నారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని చెప్పారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ పోటీల నిర్వహణ కమిటీ సభ్యులను, విలేకరులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.










