బుధవారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, నేషనల్ హైవేపై టాటా ఏస్ వాహనం అగ్నిప్రమాదానికి గురైంది. గర్నిమిట్ట నుంచి భాకరాపేటకు గుజిరి సామాన్లు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికుల సమాచారంతో పీలేరు ఫైర్ స్టేషన్ సిబ్బంది, రొంపిచర్ల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో వాహనంలోని సరుకులు దగ్ధమయ్యాయి# కొత్తూరు మురళి .










