విదేశీ విద్యా పథకం అమలు: పేద విద్యార్థులకు గుడ్‌న్యూస్

0
0

ఏపీలో విదేశీ విద్యా పథకం పునరుద్ధరణ

ఆంధ్రప్రదేశ్‌లో పేద విద్యార్థుల కోసం ఈ ఏడాది నుంచే ‘విదేశీ విద్యా పథకాన్ని’ అమలు చేయనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. గతంలోని ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి’ తరహాలో ఈ పథకాన్ని రూపొందించారు. దీని ద్వారా ఎస్సీలతో పాటు దారిద్ర్య రేఖకు దిగువన (BPL) ఉన్న అన్ని వర్గాల విద్యార్థులకు విదేశీ విద్యకు అవకాశం లభిస్తుంది.

గత ప్రభుత్వం కంటే ఎక్కువ మందికి పారదర్శకంగా లబ్ధి చేకూరుస్తామని మంత్రి తెలిపారు. దీంతో పాటు ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం, 989 హాస్టళ్లలో ఏఐ (AI) కెమెరాల ఏర్పాటు, ఎస్సీ అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.