అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, జే టౌన్ సమీపంలో బుధవారం కొత్తకోట గ్రామానికి వెళ్తున్న మాజీ బోయకొండ చైర్మన్ ఎస్‌కే రమణారెడ్డిని, టీఎన్‌టీయూసీ నాయకుడు జల్లి మనోహర్ కుటుంబ సభ్యులు తమపై అక్రమ కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఈ క్రమంలో, జల్లి మనోహర్ భార్య మంజుల.
కోడలు దీప, ఎస్. కె రమణారెడ్డిని నిలదీయగా ఆయన దురుసుగా ప్రవర్తించి దీపను తోసివేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గాయపడిన దీపను కుటుంబ సభ్యులు వెంటనే పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు# కొత్తూరు మురళి.










