అక్రమ మద్యం, గంజాయిపై ఉక్కుపాదం: మంత్రి కొల్లు రవీంద్ర.

0
5

మదనపల్లె కలెక్టరేట్‌లో గురువారం జరిగిన సమీక్షలో రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లాలో అక్రమ మద్యం, నాటుసారా, గంజాయి, ఇసుక స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

బెల్ట్ షాపులను పూర్తిగా నియంత్రించాలని సూచించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ, ఇతర శాఖల సమన్వయంతో అక్రమ కార్యకలాపాలపై దాడులు నిర్వహిస్తామని, పదేపదే నేరాలకు పాల్పడేవారిపై రౌడీషీట్లు తెరిచి పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని తెలిపారు.