వలసపల్లి గ్రానైట్ క్వారీని పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర.

0
4

గురువారం మదనపల్లి మండలం వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. రాష్ట్ర మైనింగ్ రంగాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని, నిలిచిపోయిన గనులను పునఃప్రారంభించడం ద్వారా 40 శాతం అదనపు ఆదాయం సాధించినట్లు ఆయన తెలిపారు.

మదనపల్లి ప్రాంతంలో క్వార్ట్జ్, లైమ్ స్టోన్, గ్రానైట్, ఐరన్ ఓర్ వంటి విలువైన ఖనిజాలు ఉన్నాయని, ఖనిజాల విలువ పెంపు, మార్కెట్ విస్తరణతో పాటు అక్రమాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి వెల్లడించారు.