నిమ్మనపల్లి: భూ వివాదం నేపథ్యంలో మహిళపై దాడి.

0
0

నిమ్మనపల్లి మండలంలో భూ వివాదం కారణంగా గారబురుజు గ్రామానికి చెందిన నాగరత్న (40) అనే మహిళపై శుక్రవారం కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించడాన్ని అడ్డుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ దాడిలో నాగరత్నకు గాయాలయ్యాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు.