జగన్ పేరులో ‘జీ’ అంటే గొడ్డలి: మంత్రి నారా లోకేశ్

0
0

జగన్ పేరులో ‘జీ’ అంటే గొడ్డలి: మంత్రి నారా లోకేశ్

ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభలో మంత్రి నారా లోకేశ్ ప్రతిపక్ష నేత జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ పేరులో ‘జీ’ అంటే ‘జెన్ జీ’ కాదని, ‘గొడ్డలి’ అని.. విధ్వంసమే ఆయన ఎజెండా అని మండిపడ్డారు. జగన్‌కు క్రెడిట్ చోరీ డిజార్డర్ (సీసీడీ) అనే జబ్బు ఉందంటూ సెటైర్లు వేశారు.

రాయలసీమను ‘రాయల్ సీమ’గా మార్చేందుకు రూ. లక్ష కోట్లతో ‘మిషన్ రాయలసీమ’ ప్రాజెక్టును ప్రారంభిస్తామని ప్రకటించారు. తమది ‘డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్’ అని, కేంద్ర సహాయంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని స్పష్టం చేశారు.