ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 2024 లో లభించిన చారిత్రాత్మక తీర్పు అహంకార, విధ్వంసక రాజకీయాలపై సాధించిన విజయమన్నారు.
అధికారాన్ని పంచుకోవడం కోసం కాకుండా, బాధ్యతను పంచుకోవడానికే కూటమి ఏర్పడిందని పవన్ తెలిపారు. సమష్టి కృషితో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకున్నామని చెప్తూ, ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.










