ఏపీలో విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు: భారీ వర్ష సూచన
ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే రెండు మూడు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, కడప, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు.
పిడుగులు, ఈదురుగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. కాగా, ఈ వర్షాలు ఖరీఫ్ సాగు పనులకు అనుకూలంగా మారడంతో రైతులు వ్యవసాయ పనులను వేగవంతం చేశారు.










