చిన్నారుల భద్రత వీడియోపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ శైలజ ప్రశంసలు

0
4

చిన్నారుల భద్రత వీడియోపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ శైలజ ప్రశంసలు

చిన్నారుల భద్రత కోసం ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ అంశంపై రూపొందించిన కార్టూన్ అవగాహన వీడియో విశేష ఆదరణ పొందుతోంది. పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు పర్యవేక్షణలోని ‘ఖాకీ స్టూడియో’ ఏఐ సాంకేతికతతో ఈ వీడియోను వినూత్నంగా రూపొందించింది.

ఈ ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ శైలజ రాయపాటి కొనియాడారు. బాలల రక్షణ పట్ల పోలీస్ శాఖకున్న నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. సైబర్ నేరాలు, మహిళా, శిశు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ ఖాకీ స్టూడియో ఎంతో దోహదపడుతోందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.