మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో తెనాలిలో మంగళవారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది. తొలి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తెనాలి తాసిల్దార్ (ఎమ్మార్వో) గోపాలకృష్ణ వినియోగించుకున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల కోసం మంగళ,బుధవారాల్లో పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అధికారం కల్పించామని అర్హులైన ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మార్వో సూచించారు. ఓటు వేసే ఉద్యోగులు తమ ఓటర్ ఐడి కార్డును, ఉద్యోగ ఐడి కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.










