అన్నమయ్య జిల్లాలో సోర్స్ కనెక్టివిటీ, చెరువుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు సోర్స్ కనెక్టివిటీ కల్పించడం, నీటి వనరుల పునరుద్ధరణ, చెరువుల అనుసంధానం, బ్రీచ్ అయిన నీటి వనరుల మరమ్మతులపై చర్చించారు.
వాసర్ ల్యాబ్స్ నిపుణులు సమర్పించిన నివేదికలు, మ్యాపుల ఆధారంగా సోమల, కలికిరి, పెద్దమండ్యం తదితర మండలాల్లో నీటి వనరుల అనుసంధాన అవకాశాలను పరిశీలించారు. అవసరమైన ప్రాంతాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని సూచించారు.










