హైదరాబాద్: సమాజంలోని యువత, యువకులు, విద్యార్థులకు నేరాలు చేసినప్పుడు ఎదురయ్యే శిక్షలు మరియు జైలు జీవితం గురించి అవగాహన కల్పించేందుకు చంచల్‌గూడ జైలులో “ఫీల్ ది జైలు” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జైలు మ్యూజియాన్ని సందర్శించిన వారు బ్రిటిష్ మరియు నిజాం కాలాల్లో జైళ్లు ఎలా ఉండేవో, అప్పటి శిక్షా విధానాలు మరియు జైళ్ల చరిత్ర గురించి తెలుసుకున్నారు. అలాగే “ఫీల్ ది జైలు” కేంద్రంలో ఖైదీల దైనందిన జీవనం, జైలు పరిస్థితులు.
జైలులో జీవితం ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకునే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా యువత చట్టాలను గౌరవించడం, నేరాల పట్ల జాగ్రత్తగా ఉండడం, జైలు జీవితంలోని కష్టాలను అర్థం చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు. నేటి యువత, విద్యార్థులు జైలు జీవితం మరియు చట్టపరమైన శిక్షల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవేందర్, రమేష్‌బాబు, గీతారెడ్డి, డా. స్నిగ్ధ, డా. శ్రీవాణి, ప్రగతి, గంగాధర్, ప్రశాంత్, నర్సింగం, అక్షయ్ కుమార్, గిరి పోతరాజు, వేణు, అద్వైత తదితరులు పాల్గొన్నారు.










