గూడెం ఆలయాభివృద్ధికి రూ.58 కోట్లు: ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్ రావు

0
1

గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాభివృద్ధికి రూ.58 కోట్లు: ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్ రావు

మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.58 కోట్లు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. గూడెం గుట్టపై ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ నిధులతో ఘాట్ రోడ్డు, స్నాన ఘట్టాలు, వసతి గృహాలు, క్యూలైన్లు నిర్మించి ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామన్నారు.

శనివారం జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు హాజరవుతున్నట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.