జూన్ 16 నుండి 28 వరకు హైదరాబాద్లో రగ్బీ ప్రీమియర్ లీగ్ పోటీల నిర్వహణ : అధ్యక్షులు నరేంద్ర రామ్ నంబూల

0
19

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బాలయోగి అథ్లెటిక్స్  స్టేడియంలో జూన్ 16 నుండి 28 వరకు నిర్వహించబడనున్న ప్రతిష్టాత్మక రగ్బీ ప్రీమియర్ లీగ్ (RPL) సీజన్ 2లో 10 జట్లు (6 పురుషుల ఫ్రాంచైజీలు మరియు 4 మహిళల జట్లు) పాల్గొంటాయని ఇవి 48 మ్యాచ్లలో పోటీపడతాయని ఇందులో 19 దేశాల నుండి 70 మందికి పైగా అంతర్జాతీయ రగ్బీ సెవెన్స్ ఆటగాళ్లతో పాటు భారతదేశంలోని అగ్రశ్రేణి రగ్బీ ప్రతిభావంతులు కూడా పాల్గొంటారని తెలిపారు భారతదేశపు ప్రధాన ఫ్రాంచైజీ ఆధారిత రగ్బీ పోటీగా, ఈ లీగ్ క్రీడను అభివృద్ధి చేయడంలో భారత దేశం యొక్క విస్తృత క్రీడా, ఒలింపిక్ ఆశయాలకు మద్దతు ఇవ్వడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగన్నారు. తెలంగాణ క్రీడా శాఖ క్రీడలను ప్రోత్సహించడంలో వివిధ క్రీడాంశాలలో లీగ్ పోటీలకు సహకారం అందజేస్తుందని తెలిపారు, తెలంగాణ రాష్ట్రంలోని రగ్బీ క్రీడాకారులు, కోచ్‌లు, రిఫరీలు, జిల్లా సంఘాల ప్రతినిధులు మరియు క్రీడాభిమానులందరినీ తెలంగాణ రగ్బీ అసోసియేషన్ అధ్యక్షులు నరేంద్ర రామ్ నంబూల, రాష్ట్ర కార్యదర్శి ఆదిత్య ఉట్పల హృదయపూర్వకంగా ఆహ్వానించారు,భారతదేశంలో రగ్బీ క్రీడకు కొత్త ఊపును తీసుకువస్తున్న ఈ లీగ్‌లో దేశంలోని అత్యుత్తమ ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారని, ఈ అవకాశాన్ని తెలంగాణ రగ్బీ కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.రగ్బీ అభివృద్ధికి మనమంతా భాగస్వాములం. రండి… రగ్బీ ప్రీమియర్ లీగ్‌ను విజయవంతం చేసి తెలంగాణ రగ్బీ సత్తాను చాటుదాం.