మదనపల్లెలో టైలర్ పై మందుబాబుల దాడి.

0
1

శనివారం మదనపల్లె పట్టణంలోని ఆర్ఆర్ వీధిలో టైలర్ బావాజాన్ (43)పై మందుబాబులు దాడి చేశారు. ఉదయం తన దుకాణం తెరిచేందుకు వెళ్లినప్పుడు, షాపు ముందు మద్యం మత్తులో .

నిద్రిస్తున్న వారిని వెళ్లమని కోరడంతో ఆగ్రహించిన వారు బావాజాన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.