రాయలసీమ యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ల అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆర్‌పీఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది డిమాండ్ చేశారు. అక్రమాలను ప్రశ్నించినందుకు విద్యార్థి సంఘాల నాయకులు నాగరాజు, శరత్‌లపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు.
ఈ వ్యవహారంపై ఇప్పటికే జిల్లా మంత్రి టీజీ భరత్ స్పందించి విజిలెన్స్ విచారణకు సిఫారసు లేఖ రాశారని తెలిపారు. విద్యార్థుల సమస్యలను, వర్సిటీలో జరుగుతున్న దొంగతనాలను ప్రశ్నిస్తే సెక్యూరిటీతో గెంట్టేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే వర్సిటీని ముట్టడిస్తామని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.










