పుంగనూరులో ఈనెల 18న జాబ్ మేళా: ఆర్ సి వై

0
0

బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరులో ఈనెల 18న జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ మేళాలో 120 కంపెనీలు పాల్గొంటాయని, 22 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

10వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ విద్యార్హతలు కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాంపల్లి బైపాస్ జంక్షన్ వద్ద ఉన్న ఆర్సీవై ఎస్టేట్లో ఈ జాబ్ మేళా జరగనుంది# కొత్తూరు మురళి.