ఓటర్ల జాబితాలో అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలి: నిసార్ అహమద్

0
1

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరగకుండా బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహమద్ సూచించారు. నిమ్మనపల్లె మండలంలో జరిగిన BLOల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడం.

అనర్హులను చేర్చడం వంటి చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ERMS, NVSP, ఫారం-6, 7, 8, ఓటర్ల ధృవీకరణ, మ్యాపింగ్ ప్రక్రియలపై అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.