శ్రీరాంపూర్ : ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 8వ వార్డులో కార్పొరేటర్ మేకల రామ్ విస్తృతంగా పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యానికి సంబంధించిన సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను నేరుగా కార్పొరేటర్‌కు వివరించగా, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని మేకల రామ్ తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.”ప్రజల సమస్యలే నా బాధ్యత – వార్డు అభివృద్ధే నా లక్ష్యం” అని కార్పొరేటర్ మేకల రామ్ అన్నారు.










