పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల కేసీఆర్ తీవ్ర విచారం|

0
0

తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక ఆప్త మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోయానని ఆయన ఆవేదన చెందారు. తెలంగాణ మలిదశ పోరాటంలో తనతో కలిసి నడిచిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

పెద్దిని బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం బాధిస్తోందన్నారు. పోలీసు కేసులు, జైలు నిర్బంధాలకు భయపడకుండా పోరాడిన ధీరుడని, ఆయన నిజాయితీ గల రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమని కేసీఆర్ కొనియాడారు. నర్సంపేట అభివృద్ధిలో ఆయన చెరగని ముద్ర వేశారని, ఈ మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో పెద్ది కుటుంబానికి, కార్యకర్తలకు పార్టీ పూర్తి అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.